: ఓటుకు నోటు కేసులో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
ఓటుకు నోటు కేసులో తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఈరోజు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత సోమవారం ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.