: సిరిసిల్లలో అఖిలపక్ష నేతలు, న్యాయవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంటే మరోవైపు తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల వాసులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సిరిసిల్లను జిల్లా చేయాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో అఖిలపక్ష నేతలు, న్యాయవాదులు 48 గంటల బంద్ నిర్వహిస్తున్నారు. బంద్‌లో పాల్గొంటున్న 36 మంది అఖిలపక్ష నేతలు, న్యాయవాదులను పోలీసులు ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు పీఎస్‌లోనే ధర్నాకు దిగారు. సిరిసిల్లలో బంద్ వాతావరణం ఉండకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బంద్‌కు మద్దతుగా విద్యాసంస్థలు కూడా తెరచుకోలేదు.