: ‘నీలి’ టేపులో ఇద్దరు మహిళలతో ఢిల్లీ మంత్రి!... అందుకే వేటు వేసిన కేజ్రీవాల్!
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ లో నిన్న పెను కలకలమే రేగింది. కేజ్రీ కేబినెట్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సందీప్ కుమార్ కు చెందిన ఓ వీడియో నిన్న కేజ్రీకి అందిందట. సదరు సీడీలో ఉన్న వీడియోను చూసిన కేజ్రీ షాక్ తిన్నారు. సదరు వీడియోలో ఇద్దరు మహిళలతో కలిసి కనిపించిన సందీప్... అభ్యంతరకర భంగిమల్లో కనిపించారు. వెనువెంటనే స్పందించిన కేజ్రీ... సందీప్ ను తన కేబినెట్ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిన్న వరుస ట్వీట్లలో కేజ్రీ ఈ విషయాన్ని వెల్లడించారు.