: ‘సుజనా’ ఎండీ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారట!... సమన్లు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు!


మారిషస్ బ్యాంకు రుణానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీకి నోటీసులు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సుజనా చౌదరి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఆయన కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ వంతు వచ్చింది. సుజనా యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.శ్రీనివాసరాజుకు నిన్న సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 2న తమ ముందు హాజరుకావాలంటూ కోర్టు న్యాయమూర్తి సదరు సమన్లలో రాజును ఆదేశించారు. శ్రీనివాసరాజు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ మారిషస్ బ్యాంకు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. మారిషస్ బ్యాంకుకు చెల్లించాల్సిన రుణానికి సంబంధించి అవసరమైన మేర ఆస్తులు కంపెనీ వద్ద ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకే శ్రీనివాసరాజుకు సమన్లు జారీ చేసినట్లు న్యాయమూర్తి తెలిపారు.

  • Loading...

More Telugu News