: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు ఈసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ.3.38, డీజిల్ పై రూ.2.67 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, రెండు పర్యాయాలు స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర ఈసారి పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 63.47 కాగా, డీజిల్ ధర రూ.52.94. గతంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.60.09, రూ.50.27గా వున్నాయి.