: తొంభై ఏళ్ల బామ్మగారికి మరపురాని కానుక.. జెర్సీ నిచ్చేసిన విరాట్ కోహ్లీ


భారత్-వెస్టిండీస్ టీ 20 సిరీస్ ఆడేందుకని టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ఇటీవల అమెరికా వెళ్లాడు. కోహ్లీని కలిసేందుకని ఒక బామ్మగారు అక్కడికి వెళ్లారు. సుమారు తొంభై ఏళ్ల వయసున్న బామ్మను చూసిన కోహ్లీ ఆనందానికి హద్దుల్లేవ్. గ్రౌండ్ లో తాను ధరించే 18 నంబర్ జెర్సీని ఆ బామ్మకు బహుమతిగా ఇచ్చేశాడు. కాగా, అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇవ్వడం, వారితో సెల్ఫీలు దిగడం కోహ్లీకి మామూలే. తనకు నచ్చిన అభిమానులకు ఎక్కువగా బ్యాట్లు ఇస్తుండే కోహ్లీ, ఆ బామ్మగారికి ఏకంగా జెర్సీనే ఇచ్చేయడంతో ఆమె ఆనందానికి హద్దుల్లేవు మరి!

  • Loading...

More Telugu News