: నేను, సమంత మంచి స్నేహితులం... గాసిప్స్ గురించి మాట్లాడుకుంటాం!: నిత్యా మీనన్


సమంత, తాను మంచి స్నేహితులమని సినీ నటి నిత్యామీనన్ తెలిపింది. 'జనతా గ్యారేజ్' సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, షూటింగ్ సమయంలో తమ మధ్య ఎన్నో విషయాలపై చర్చ జరిగేదని చెప్పింది. ప్రధానంగా గాసిప్స్ పై చర్చ జరుగుతుందని చెప్పింది. తనపై పెద్దగా గాసిప్స్ ఉండవు కనుక... అందరి గాసిప్స్ గురించి చర్చించుకుని నవ్వుకుంటామని తెలిపింది. ఇక తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని తెలిపింది. మోహన్ లాల్ జాతీయ నటుడని చెప్పింది. ఆయన కళ్లు తీక్షణంగా ఉంటాయని, అవే సగం డైలాగుల్ని కన్వే చేస్తాయని చెప్పింది. దేశంలోని అద్భుతమైన నటుల్లో ఆయన ఒకరని చెప్పింది. ఆయనతో నటించడం గర్వకారణంగా ఉందని తెలిపింది. అలాంటి వ్యక్తితో నటించడం వల్ల నటన ఎంతో మెరుగవుతుందని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News