: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు


తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా సాధారణ పరిపాలన, రెవెన్యూ, హోం, రవాణా, ఐటీ, ఆర్ అండ్ బీ శాఖల కార్యదర్శులు, సీఎంవో కార్యదర్శులు శాంతికుమారి, స్మితా సబర్వాల్, వరంగల్, మెదక్ జిల్లాల కలెక్టర్లు, మెంబర్ కన్వీనర్ గా సీసీఎల్ఏ, ప్రత్యేక ఆహ్వానితులుగా డీజీపీ, అటవీశాఖ ముఖ్యసంరక్షణాధికారి, సింగరేణి సీఎండీ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు కొనసాగనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News