: తిరుమల శ్రీవారి పాదాల చెంత రోడ్డుపై కారు బోల్తా... ఇరుక్కుపోయిన డ్రైవర్


తిరుమలలో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఐదుగురు వ్యక్తులతో వెళ్తున్న ఓ కారు శ్రీవారి పాదాల రోడ్ లో బోల్తా పడింది. రోడ్డుపక్కనున్న గుంతలో పడిపోవడంతో అందులోని నలుగురు వ్యక్తులు ఎలాగోలా బయటకు వచ్చారు. అయితే డ్రైవర్ తన సీట్లోనే ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. దీంతో బయటకు వచ్చిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగ ప్రవేశం చేసి, క్రేన్ తో కారును బయటకు తీసి డ్రైవర్ ను రక్షించారు. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడడంతో... ఇంత పెద్ద ప్రమాదం జరిగినా వెంకటేశ్వర స్వామి దయ వల్లే ఎలాంటి దారుణం చోటుచేసుకోలేదని భక్తులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News