: ఓటుకు నోటు కేసు: రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు


ఓటుకు నోటు కేసులో అన్ని అంశాలను ఛేదించేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ముమ్మర కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌నే ఏసీబీ కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. ఈ కేసులో వచ్చేనెల 29వ తేదీన కోర్టుకు హాజరు కావాలని టీడీపీ నేత‌ రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్‌, ఉదయ్ సింహాల‌కు న్యాయ‌స్థానం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణకు ప్రత్యేకంగా ఎఫ్‌ఐఆర్ అవసరం లేదని ఏసీబీ అధికారులు న్యాయ‌స్థానానికి తెలిపారు.

  • Loading...

More Telugu News