: నిండిన హుస్సేన్ సాగర్... కాసేపట్లో గేట్ల ఎత్తివేత


నేడు హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. పలు ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో సాగర్ నిండుకుండలా మారగా, అధికారులు కాసేపట్లో తూములను తెరచి నీటిని మూసీలోకి వదలనున్నారు. 2008 తరువాత హుస్సేన్ సాగర్ లో పూర్తి స్థాయి నీరు ఒక్కరోజులో చేరడం ఇదే తొలిసారని వివరించారు. మూసీ కాలువలో నీరు వదులుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆగమేఘాల మీద ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరారన్న సమాచారం అందగానే గేట్లు ఎత్తివేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News