: జయేంద్ర సరస్వతి కోసం తరలివచ్చిన చెన్నై వైద్యులు
నిన్న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో చేరిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి మెరుగైన చికిత్స అందించేందుకు చెన్నై నుంచి ప్రత్యేక వైద్య బృందం విజయవాడకు వచ్చింది. నిన్నంతా వెంటిలేటర్ పై ఉన్న ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చెన్నై బృందం ఆయన్ను పరీక్షించిందని, ఆసుపత్రి సౌకర్యాలపైనా సంతృప్తిని వ్యక్తం చేసిందని వివరించారు. ఈ ఉదయం వెంటిలేటర్ ను తొలగించామని పేర్కొన్నారు. ఆయన బీపీ, షుగర్ తో బాధపడుతున్నారని తెలిపారు.