: అల్లరి చేసినప్పుడు మా అబ్బాయిని మందలిస్తే తిరిగి కొడుతున్నాడు: జూనియర్ ఎన్టీఆర్


‘అల్లరి చేసినప్పుడు మందలిస్తే మా అబ్బాయి తిరిగి గట్టిగా కొడుతున్నాడు’ అని జూనియర్ ఎన్టీఆర్ నవ్వుతూ చెప్పాడు. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, 'ఇచట అన్నీ రిపేర్లు చేయబడును' అంటే వాహనాలతో పాటు మనుషులను కూడా రిపేర్ చేస్తారని అర్థమని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ చిత్రానికి సంబంధించి పలు విశేషాలను చెప్పారు. తన ముద్దుల కొడుకు అభయ్ రామ్ అల్లరి గురించి కూడా ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించాడు. మట్టిలో బాగా ఆడుకుంటున్నాడని, తన కొడుకు కోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని చెప్పాడు. తండ్రి పొందే అనుభూతి ఏంటో ఇప్పుడు తనకు అర్థమైందని యంగ్ టైగర్ చెప్పాడు.

  • Loading...

More Telugu News