: చంద్రబాబు ఆదేశాల మేరకు జైట్లీ, అమిత్ షా, వెంకయ్యలతో చర్చించా.. త్వరలో ఒక నిర్ణయం వెలువడొచ్చు: సుజనా చౌదరి
విభజన చట్టం అమలు, విశాఖ రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడుతో కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తనకు ఫోనులో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రమంత్రులతో రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీపై ఒక ముసాయిదా తయారుచేస్తోందని ఆయన అన్నారు. త్వరలో ఒక నిర్ణయం వెలువడొచ్చని ఆయన పేర్కొన్నారు.