: ముగిసిన బీఏసీ సమావేశం.. వచ్చేనెల 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగింపు
వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుపై శాసనసభలో సీఎం కేసీఆర్ ఈరోజు ప్రవేశపెట్టిన జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తరువాత సభావ్యవహారాల సలహాసంఘం (బీఏసీ) భేటీ అయింది. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీని ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించారు. భద్రతా కారణాల దృష్ట్యా వినాయక నిమజ్జనం తరువాత సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. బీఏసీ సమావేశంలో వచ్చేనెల 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పది పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు.