: ప్రస్తుతం నేను 'సింగిల్' కాదు: వరుణ్ ధావన్


2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన వరుణ్ ధావన్ విభిన్నమైన పాత్రలతో నటుడిగా నిరూపించుకుంటున్నాడు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడైన వరుణ్ ప్రస్తుతం తాను 'సింగిల్' కాదని బహిరంగంగా చెప్పుకున్నాడు. సోఫీ చౌదరి రూపొందించిన ‘సాజన్ మై నే నాచూంగీ’ ఆడియో ఆవిష్కరణలో పాల్గొన్న సందర్భంగా సోఫీ మాట్లాడుతూ, వరుణ్ ఇంకా ఒంటరిగా ఉంటున్నాడని నవ్వుతూ వ్యాఖ్యానించింది. వెంటనే స్పందించిన వరుణ్ తాను ‘సింగిల్’ కాదని తేల్చి చెప్పాడు. డిజైనర్ నటాషా దలాల్ తో వరుణ్ ప్రేమలో మునిగి తేలుతున్నట్టు గత కొంతకాలంగా బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాను సింగిల్ కాదని వరుణ్ ఒప్పుకోవడంతో ఇది నిజమేనని తేలిపోయింది.

  • Loading...

More Telugu News