: ఈ పదవి నాకెందుకు? రాజీనామాకు నేనెప్పుడైనా రెడీనే!: సినీ నటుడు, ఎంపీ మురళీమోహన్
తానేమీ రాజకీయాల్లో పదవులు పట్టుకు వేలాడే వ్యక్తిని కాదని సీనియర్ సినీ నటుడు, ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలసి రాజమహేంద్రవరం నుంచి రామచంద్రాపురం మధ్య సరికొత్త బస్సు సర్వీస్ ను ప్రారంభించిన ఆయన, మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు తాను కట్టుబడి ఉన్నానని, తన రాజీనామాతో హోదా వస్తుందంటే అందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ఎంపీ పదవి తనకు ముఖ్యం కాదని, అందరినీ కలుపుకుని స్పెషల్ స్టాటస్ కోసం పోరాడతామని వివరించారు.