: అది డాక్టర్ ఇల్లా? తుపాకుల కర్మాగారమా?


ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఓ వైద్యుడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు అతని ఇంటి మూడో అంతస్తులోకి వెళ్లి ఇది ఇల్లా? తుపాకులు కర్మాగారమా? అని ఆశ్చర్యపోయిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తాజాగా ఎలాంటి లైసెన్స్ లేకుండా ఆధునిక తుపాకీ కలిగిన వ్యక్తిని రాయ్ పూర్ లో పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, తాను ఆ తుపాకీని హోమియోపతి డాక్టర్ అనిరుద్ధ ఛటర్జీ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపాడు. ఇలాంటి తుపాకులు ఆయన దగ్గర మాత్రమే దొరుకుతాయని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అనిరుద్ధ్ చటర్జీ మూడు అంతస్తుల భవనంలో సోదాలు చేశారు. మూడో అంతస్తులోకి ప్రవేశించిన పోలీసులు షాక్ అయ్యారు. భారీగా తుపాకులు, కత్తులు, మారణాయుధాలు అక్కడ లభించాయి. ఈ అంతస్తు ఏకంగా తుపాకీ తయారీ కర్మాగారాన్ని తలపించింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరా చేస్తున్న కోణంలో ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News