: నేను కెప్టెన్ గా సక్సెస్ కాకపోవడానికి కారణం సహచరులు మద్దతివ్వకపోవడమే: దిల్షాన్


తాను కెప్టెన్ గా సక్సెస్ అవ్వకపోవడానికి కారణం సహచరుల నుంచి మద్దతు కరవవ్వడమేనని శ్రీలంక డాషింగ్ ఓపెనర్ దిల్షాన్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా చేతిలో ఓటమిపాలైన తరువాత సంగక్కర కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని, ఆయన తప్పుకున్న తరువాత తనను సెలెక్టర్లు కెప్టెన్ ను చేశారని అన్నాడు. ఆ సమయంలో సహచరుల నుంచి అస్సలు సహకారం అందలేదని చెప్పాడు. దీంతో ఆ సమయంలో తమ జట్టు ఎన్నో ఓటములు చవిచూసిందని దిల్షాన్ పేర్కొన్నాడు. దీంతో తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నానని తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని దిల్షాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News