: ‘ఫీల్ ద జైల్’... రూ.500 చెల్లిస్తే ఒక్కరోజు జైలు జీవితం అనుభవించచ్చు!
జైలు జీవితం ఎలాగుంటుందో తెలుసుకోవాలనుకునే వారి కోసం తెలంగాణ జైళ్ల శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ‘ఫీల్ ద జైల్’ పేరిట ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సంగారెడ్డి జైల్ మ్యూజియంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జైలు జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనే వారు ఒక్కరోజు జైలు జీవితం గడపవచ్చని, అందుకుగాను రూ.500 చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు చెప్పారు. జైళ్లలో నెలకొన్న వాతావరణంపై ఉన్న అపోహలను పోగొట్టే ప్రయత్నంలో భాగంగానే ‘ఫీల్ ద జైల్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. యూనిఫామ్, భోజన వసతితో పాటు ఖైదీలను ఎలా ట్రీట్ చేస్తారో అదేవిధంగా ఒక్కరోజు జైలు జీవితం గడిపేవారిని ట్రీట్ చేస్తారన్నారు. జైలు జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్న ముగ్గురు ఔత్సాహికులు ఇప్పటికే డబ్బు చెల్లించారని హెరిటేజ్ జైల్ మ్యూజియం అధికారి తెలిపారు.