: పోలవరం పనులు ఎందుకు ఆపలేదు?: కేంద్రానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ప్రశ్న


పోలవరం నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ ఒడిశా వాసి దరిలింగా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలపై ట్రైబ్యునల్ మండిపడింది. ఆ ప్రాజెక్టు ప‌నుల‌ని ఇంకా ఎందుకు ఆప‌లేద‌ని, స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై త‌మ‌కు నివేదిక ఇవ్వ‌లేద‌ని ఎన్‌జీటీ కేంద్రాన్ని అడిగింది. ఈ అంశంపై సంబంధిత అధికారులు వ‌చ్చేనెల 5వ తేదీన స‌మ‌గ్ర స‌మాచారంతో కోర్టుకి రావాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News