: కర్ణాటకలో ఎడ్లబండ్ల పోటీల్లో అపశ్రుతి... వృద్ధుడిపై నుంచి దూసుకుపోయిన బండ్లు
కర్ణాటకలో నిర్వహించిన ఎడ్ల బండ్ల పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అరవై ఏళ్ల వయసు గల మల్లప్ప అనే వృద్ధుడిపై నుంచి ఎడ్ల బండ్లు వెళ్లటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విజయపురాలో ఎడ్ల బండి పోటీలు ప్రారంభిస్తున్న సమయంలో మల్లప్ప తన బండి వద్ద నిలబడి ఉన్నాడు. అయితే, వెనుక ఉన్న బండ్లు ఒక్కసారిగా పరుగులు తీయడంతో వాటిని తప్పించుకునే క్రమంలో ఒక బండి తగిలి కిందపడిపోయాడు. ఆ తర్వాత వరుసగా మూడు బండ్లు ఆయనపై నుంచి దూసుకుపోయాయి. ఈ ప్రమాదంలో మల్లప్ప తల, మెడను తొక్కుకుంటూ ఎడ్ల బండ్లు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మల్లప్పకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.