: స్పానిష్ రిసార్ట్‌లో ముక్కులు బద్దలయ్యేలా పిడిగుద్దులు.. వీడియో వైరల్!.. ఇద్దరి అరెస్ట్
హాయిగా ఎంజాయ్ చేద్దామంటూ స్పానిష్ రిసార్ట్‌కి వచ్చారు. సెలవు రోజున తప్పతాగి ఎంజాయ్ చేద్దామనుకున్నారు. ఆటవిడుపు కార్యక్రమంలో ఆహ్లాదంగా గడిపేద్దాం అనుకున్నారు. అయితే ఆ రిసార్ట్‌ను రెజ్లింగ్ రింగ్‌లా మార్చేశారు. చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రేక్షకుల్లా ప్రోత్సహిస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దుస్తులు చింపేసుకొని రక్తం వచ్చేలా ఒకరినొకరు కొట్టుకున్నారు. వారిలో ఒక వ్యక్తి ముక్కుబద్దలైంది. వీరి పిడిగుద్దుల దృశ్యాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అటూ ఇటూ వెళ్లి పోలీసుల కంటపడ్డాయి. దీంతో కొట్టుకున్న ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘోరంగా కొట్టుకున్న ఈ వ్యక్తుల గురించి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. లైవ్ లో తాము చూసిన అద్భుతమైన ఫైట్ ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.