: అర్జున అవార్డులు అందుకున్న 15 మంది క్రీడాకారులు
కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల ముందు 15 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు(2016) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు ఢిల్లీలో ఈ క్రీడా పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. క్రీడాకారులు రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్), శివథాపా (బాక్సింగ్), అజింక్యా రహానే (క్రికెట్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి (హాకీ), వీఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్‌సింగ్ (షూటింగ్), అపూర్వి చందేలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్‌కుమార్ (రెజ్లింగ్), సందీప్‌సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేంద్ర సింగ్ (రెజ్లింగ్-బధిర)లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ అవార్డులను ప్రదానం చేశారు.