: పవన్ కల్యాణ్ కోరితే ప్రధానితో భేటీకి ఏర్పాట్లు చేస్తాను: బీజేపీ నేత సోము వీర్రాజు
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ కోరితే ప్రధాని మోదీతో భేటీకి ఏర్పాట్లు చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును పవన్ తప్పుపట్టిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్నివిధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పవన్ కల్యాణ్ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయా పార్టీల నాయకులు స్పందిస్తున్న విషయం తెలిసిందే.