: పవన్ కల్యాణ్ కు తిక్క ఉంటే, నాకు పిచ్చి ఉంది: అవంతి శ్రీనివాస్


పవన్ కల్యాణ్ కు తిక్క ఉంటే, తనకు పిచ్చి ఉందని అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. నిన్న తిరుపతి సభలో టీడీపీ ఎంపీలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. విశాఖపట్టణంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ నీతులు వల్లించడం మాని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల తరపున పోరాడాలని అన్నారు. "సార్ ..సార్' అంటున్నామని పవన్ అంటున్నారు. ప్రధాన మంత్రి గారిని ‘సార్’ అనకుండా ఇంకేమనాలి? ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఇప్పటివరకు 23 సార్లు ఢిల్లీకి వెళ్లారు" అని అవంతి శ్రీనివాస్ అన్నారు.

  • Loading...

More Telugu News