: రాయలసీమ మాండలికంతో అదరగొట్టిన పవన్ కల్యాణ్


జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తిరుపతిలో నిన్నటి బహిరంగ సభలో రాయలసీమ మాండలికంతో ఆకట్టుకున్నాడు. సుమారు నాలుగు సార్లు తన ప్రసంగంలో రాయలసీమ మాండలికంలో పవన్ మాట్లాడాడు. ఏఏ సందర్భాల్లో అంటే... * రాజధాని నిర్మాణం కోసం రైతు భూముల్ని ఆలోచించి తీసుకోమని చెబితే.. పవన్ కులపిచ్చితో మాట్లాడుతున్నట్లుగా వచ్చిన కథనాలను గుర్తుచేస్తూ ..‘నా కూతురు క్రిస్టియన్ అబ్బా’ అని చెప్పాడు * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మభ్యపెడుతుంటే..‘ఎందుకబ్బా మా జీవితాలతో ఆడుకుంటున్నారు’ అన్నాడు * బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాడనే ఊహాగానాలను ఖండిస్తూ ..‘నాకు అలాంటి ఇంట్రస్ట్ లేదబ్బా’ * ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రంపై పోరాటం చేసేందుకు చంద్రబాబు మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ..‘పోరాటం చేయడానికి నీకెందుకు భయం అబ్బా’ అంటూ పవన్ రాయలసీమ మాండలికంలో మాట్లాడటం గమనార్హం.

  • Loading...

More Telugu News