: హైదరాబాదులో కుండపోత వర్షం!... లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం!
భాగ్యనగరి హైదరాబాదుపై నిన్న వరుణ దేవుడు ప్రతాపం చూపాడు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం రాత్రి పొద్దుపోయే దాకా కురుస్తూనే ఉంది. ఉన్నట్టుండి ప్రారంభమైన వర్షం క్షణాల్లో భారీ వానగా రూపాంతరం చెందింది. గంటకు పైగా ఏకబిగిన కుండపోతగా కురిసిన వాన... ఆ తర్వాత కాసేపు విరామమిచ్చి మళ్లీ భారీ వానగా మారింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి నగరం నడిబొడ్డున ఉన్న పలు ప్రాంతాలతో పాటు నగర శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఫలితంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా రోడ్లపై నిలిచిన నీరు... ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించింది.