: ఆస్ట్రోనాట్ అవతారంలో సల్మాన్... ఈసారి 'బిగ్ బాస్'లో సెలబ్రిటీలు ఉండరంటూ ప్రకటన


ప్రతిఏటా సెప్టెంబర్ మధ్యలో 'కలర్స్' హిందీ టీవీలో పాప్యులర్ టీవీ షో 'బిగ్‌ బాస్‌' ప్రారంభమవుతుంది. దాంతో ఈ ఏడాది 'బిగ్ బాస్-10' ప్రమోషన్స్ ను కలర్స్ టీవీ ఛానెల్ ప్రారంభించింది. రేటింగ్ లో అగ్రస్థానంలో నిలిపే షో కావడంతో దీనిపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. అదీ కాక ఇది రియాలిటీ షో కావడం, దీనిని లైవ్ టెలీకాస్ట్ చేయడం కూడా దీనికి ఆదరణ పెరగడానికి కారణం. ఇక తాజాగా కలర్స్ టీవీ ఛానెల్ రూపొందించిన తాజా ప్రోమోలో ఆ కార్యక్రమ వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ ఆస్ట్రోనాట్‌ అవతారంలో కనిపించాడు. బిగ్‌ బాస్‌-10 షోలో సెలబ్రిటీలు ఉండరని, సామాన్యులతోనే ఈసారి షో నిర్వహించనున్నామని సల్మాన్ తెలిపాడు. చంద్రుడిపై మనిషి తొలిసారి అడుగుపెట్టినప్పుడు.. గుడ్డు నుంచి కోడిపిల్ల తొలిసారిగా పుట్టినప్పుడు సరికొత్త చరిత్ర నమోదైంది. అలాగే తొలిసారి సామాన్యులు బిగ్‌ బాస్‌ షోలోకి రాబోతున్నారని, ఇది హిస్టరీ క్రియేట్‌ చేస్తుందా? లేక మిస్టరీగా మిగులుతుందా? అంటూ సల్లూ భాయ్ ప్రచారం చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News