: చేతకాకపోతే రజనీకాంత్ లా ఇంట్లో కూర్చో!: పవన్ కల్యాణ్ కు సీపీఐ నారాయణ సూచన
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొంగే పాలల్లో ఉప్పుగళ్లు వేసే వ్యక్తి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. కడప జిల్లాలోని రాజంపేటలో ఆయన మాట్లాడుతూ, చేతనైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, లేని పక్షంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లా ఇంట్లో ఉండాలని పవన్ కల్యాణ్ కు సూచించారు. తన స్వార్ధం కోసం పవన్ కల్యాణ్ అభిమానులను వినియోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు.