: మెడతెగిపడాలి కానీ అడుగు వెనక్కి పడకూడదు!: పవన్ కల్యాణ్


అధికారంలోకి వస్తే ఒకలాగ, ప్రతిపక్షంలో ఉంటే మరొకలాగా ఉండకూడదని టీడీపీ నేతలకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేస్తే ఒకలా, ఓడిపోతే ఇంకొకలా ఉండవద్దని ఆయన అన్నారు. అసలు ఎవరైనా రాజకీయాల్లో అడుగు పెట్టేదే ప్రజలకు సేవచేయడానికి అని ఆయన గుర్తుచేశారు. ప్రజా సేవ మానేసి రాజకీయ ప్రయోజనాలు అంటూ తాత్సారం చేస్తామంటే ఎలా? అని ఆయన అడిగారు. ప్రజాసేవలో ఒకసారి అడుగు పెట్టిన తరువాత మెడతెగిపడాలి కానీ అడుగు వెనక్కి పడకూడదని, తన అడుగు వెనక్కి పడదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News