: రైలు ఢీకొనడంతో రెండు పిల్ల ఏనుగులతో పాటు తల్లి ఏనుగు మృతి


రైలు ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం బంకురా జిల్లాలోని బిషన్‌పూర్‌ గ్రామానికి సమీపంలో చోటుచేసుకుంది. రెండు పిల్ల ఏనుగులతో కలిసి బయలుదేరిన తల్లి ఏనుగు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఖరగ్‌పూర్‌-అద్రా ప్యాసింజర్‌ రైలు ఏనుగుల‌ని ఢీ కొట్టింద‌ని సంబంధిత రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు. ప్రమాదం జ‌రిగిన కార‌ణంగా ఆ ట్రాక్‌పై నుంచి వెళ్లాల్సిన ప‌లు రైళ్ల‌ను రెండు గంటల పాటు ఆపేశారు. రైల్వే అధికారులు, స్థానికులు క‌లిసి మృతి చెందిన ఏనుగుల కళేబరాలను అక్క‌డి నుంచి తొలగించారు.

  • Loading...

More Telugu News