: మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అసదుద్దీన్ ఒవైసీ హర్షం
మహారాష్ట్రతో మూడు ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న అంశంపై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారుని అభినందిస్తున్నట్లు తెలిపిన ఆయన, 2019 నాటికి గోదావరి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలని అన్నారు. గోదావరి నీటి వాడకంపై గతంలో ఒప్పందాలు లేవని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారని ఒవైసీ చెప్పారు. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.