: ఎస్ఆర్బీసీ కెనాల్ కు గండి... వందల ఎకరాల పంట నష్టం


కర్నూలు జిల్లాకు తాగు నీరందించే ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువకు ఈ తెల్లవారుఝామున గండి పడింది. అవుకు, మెట్టుపల్లి మధ్య కాలువకు గండి పడగా వందల క్యూసెక్కుల నీరు పంటపొలాలను ముంచెత్తింది. 150 ఎకరాల పంటకు ఇప్పటివరకూ నష్టం వాటిల్లిందని సమాచారం. ఇంకా గండిని పూడ్చకపోవడంతో నీరు వృథాగా పోతూ పంట నష్టాన్ని పెంచుతోందని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే గండిని పూడ్చే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గండి పూడ్చివేతకు చర్యలు ప్రారంభించామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News