: విజయవాడ, విశాఖ విలువ తెలియాలంటే సమయం పడుతుంది: చంద్రబాబు
పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖలూ భ్రష్టు పట్టిపోయాయని, తాను అధికారంలోకి వచ్చిన తరువాతనే పాలనను గాడిలో పెట్టానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, దేశంలోనే విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు లేవని, అయితే వాటి విలువ తెలియడానికి మరికొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో తాను అమెరికాకు వెళ్లిన వేళ, హైదరాబాద్ నుంచి వచ్చానని చెబితే, పాకిస్థాన్ లోని హైదరాబాద్ నుంచా? అన్న ప్రశ్న ఎదురైందని, ఇప్పుడు హైదరాబాద్ అంటే పాక్ పేరు గుర్తుకు రాని విధంగా అభివృద్ధి చేసి చూపానని అన్నారు. గత పాలకులు చేసిన తప్పులను తాను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు.