: ఇకపై విమానాల్లో నో సెల్ఫీస్... త్వరలో డీజీసీఏ మార్గదర్శకాలు
సెల్ఫీ ప్రియులకు ఒక చేదువార్త. ఎందుకంటే, విమానాల్లో సెల్ఫీలను నిషేధిస్తూ త్వరలోనే నిబంధనలు వెలువడనున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించనుంది. భద్రతా కారణాల రీత్యా విమానం లోపల, కాక్ పిట్ లో సెల్ఫీలు దిగడాన్ని నిషేధిస్తూ ఈ మార్గదర్శకాలు రూపొందుతున్నట్లు సమాచారం. విమాన సిబ్బంది సహా ప్రయాణికులు ఇకపై ఈ విధంగా సెల్ఫీలు దిగేందుకు వీలుండదని విమానయానశాఖకు చెందిన ఒక అధికారి పేర్కొన్నారు. కాగా, ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ -1937ను అనుసరించి విమానాశ్రయంలో, విమానంలో ఎవరైనా ఫొటోలు దిగడం నిషేధం. ఒకవేళ ఫొటోలు దిగాలనుకున్న వారు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.