: కేంద్రమంత్రి మండలి సమావేశం ప్రారంభం


ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి క్యాబినెట్, స్వతంత్ర హోదా, సహాయమంత్రులు హాజరయ్యారు. తిరంగా యాత్ర సహా క్యాబినెట్ నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించనున్నారు. వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారని, ఆయా శాఖల మంత్రులు ప్రధానికి నివేదికలు సమర్పించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News