: రేపటి సభలో పవన్ ఈ అంశాలు ప్రస్తావిస్తారట?
జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తిరుపతి ఇందిరా మైదానంలో రేపు నిర్వహించనున్న బహిరంగ సభపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఎందుకంటే, ఈ బహిరంగ సభలో పవన్ ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. అదీగాక, 2014 ఎన్నికల ప్రచారం తర్వాత ఎక్కడా ఆయన సభలు నిర్వహించలేదు. దీంతో, రేపు నిర్వహించనున్న ఈ సభపై ఆయన అభిమానులు, రాజకీయనాయకుల్లో ఆసక్తి నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా, బీజేపీ-టీడీపీల తీరు, కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వానికి సూచన, పవన్ యాంటీ-ఫ్యాన్స్ కు హితబోధ, ఏపీ, తెలంగాణలోని ప్రతిపక్షాలు పవన్ పై చేస్తున్న విమర్శలు మొదలైన అంశాలను పవన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 2019 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.