: కొందరు రాక్షసుల్లా అడ్డుపడినా రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు


కొందరు రాక్షసుల్లా అడ్డుపడినా, రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతూ, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టారని.. రాజధాని నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణాలకు కొందరు అడ్డుపడ్డారని, అయినా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతోందని, పోలవరంపై కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని, అసూయ, బాధతో ప్రతిపక్ష నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

  • Loading...

More Telugu News