: జర్మనీ ఛాన్స్ లర్ పై హత్యాయత్నానికి కుట్ర
జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ పై హత్యాయత్నానికి కుట్ర పన్నిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెక్ ప్రధాని సొబోట్కాను కలిసేందుకు ఏంజెలా ప్రేగ్ వెళ్లిన సమయంలో సాయుధుడైన ఒక వ్యక్తి ఆమె కాన్వాయ్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించాడు. ఎయిర్ పోర్టులో దిగిన మెర్కెల్ నగరంలోకి వెళుతున్న సమయంలో, అదే దారిలో బ్లాక్ మెర్సిడెజ్ బెంజ్ కారులో ఒక దుండగుడు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పక్కకు తప్పుకోవాలన్న పోలీసుల ఆదేశాలను ఆ దుండగుడు పట్టించుకోలేదు. పోలీస్ వాహనంలోని వారు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీస్ వాహనాన్ని తప్పించుకుని మరీ, ఆ దుండగుడు ఏంజెలా కాన్వాయ్ లోకి ప్రవేశించడానికి యత్నించాడని ప్రేగ్ డిటెక్టివ్స్ పేర్కొన్నారు.పోలీసులు షూటింగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత గానీ, ఆ దుండగుడు లొంగిపోలేదని చెప్పారు.