: హైదరాబాదులో గుజరాత్ సీఎం... ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేటి ఉదయం భాగ్యనగరి హైదరాబాదులో ల్యాండయ్యారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం హైదరాబాదు వచ్చిన ఆయన కొద్దిసేపటి క్రితం శంషాబాదు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాదు వచ్చిన ఆయనకు స్థానిక బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రూపానీ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సమర్ధ పాలన సాగిస్తున్నారని చెప్పారు. రియోలో భారత్ సత్తా చాటిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు నజరానాపై తమ రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.