: పవన్ కల్యాణ్ తో ‘కాపు’ కార్పొరేషన్ డైరెక్టర్ భేటీ!... సర్కారీ ప్రోత్సాహకాలను మెచ్చుకున్న పవర్ స్టార్!


టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో నేటి ఉదయం ఏపీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తిరుమలలోని పవన్ కల్యాణ్ బస చేసిన అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో ఆసక్తికర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, బలిజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను పవన్ కల్యాణ్ కు మురళి వివరించారు. విద్యార్థులకు విదేశీ విద్య, సివిల్స్ కు ఉచిత శిక్షణ, నిరుద్యోగులకు రుణాలు... తదితరాలను మురళి ప్రస్తావించారట. వీటిని ఆసక్తిగా విన్న పవన్ కల్యాణ్... కాపులకు సర్కారు అందిస్తున్న ప్రోత్సాహకాలను మెచ్చుకున్నారని మురళి తెలిపారు. పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News