: రియోలో సుధకు సోకిన జికా వైరస్... గది పంచుకున్న క్రీడాకారిణులకు అంటుకున్న హెచ్1ఎన్1


రియో ఒలింపిక్స్ పోటీలకు వెళ్లి మారథాన్ పోటీలో పాల్గొన్న ఓపీ జైషాతో పాటు ఆమెతో గదిని పంచుకున్న క్రీడాకారిణులందరికీ స్వైన్ ఫ్లూ సోకింది. స్టిపుల్ చేజ్ ఆడిన సుధ అనే క్రీడాకారిణికి ప్రమాదకర 'జికా' వైరస్ సోకింది. జికా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆమెను ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాను కిలోమీటర్ల కొద్దీ పరుగు పెడుతుంటే, కనీసం మంచినీళ్లు ఇచ్చే ఏర్పాటును కూడా అధికారులు చేయలేదని సంచలన ఆరోపణలు చేసిన జైషా ప్రస్తుతం హెచ్1ఎన్1 వైరస్ సోకి బెంగళూరులోని ఆసుపత్రి ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రమాదం లేదని, ప్రస్తుతం పరిశీలనలో ఉంచామని సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ సరళ వెల్లడించారు. కాగా, రియోలో జైషా రూమ్ మేట్ సుధా సింగ్ కు కూడా స్వైన్ ఫ్లూ సోకగా ఆమె చికిత్స తీసుకుని డిశ్చార్జ్ కాగా, ఆపై జైషాతో పాటు అదే రూములో ఉన్న కవితకు వ్యాధి లక్షణాలు కనిపించగా పరీక్షలు జరిపితే పాజిటివ్ గా తేలింది. కాగా, వీరంతా రియోకు బయలుదేరే ముందే జికా వైరస్ పై అవగాహన కల్పించామని ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. తమ సూచనలు పాటించనందునే వీరికి వ్యాధి సోకిందని వివరించింది.

  • Loading...

More Telugu News