: 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' సీక్రెట్ గా సీన్ ను చిత్రీకరించిన రాజమౌళి


తాను ఎంతగానో అభిమానించి, ప్రాణాలైనా అర్పించేంతటి భక్తిని బాహుబలిపై చూపే కట్టప్ప ఆయన్నే ఎందుకు చంపాల్సి వచ్చింది?... దాదాపు ఏడాదిన్నరగా, తెలుగు రాష్ట్ర సినీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి - ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరి మదినీ తొలచి వేస్తున్న ప్రశ్న ఇది. ఇక బాహుబలి ముగింపు భాగం షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్న దర్శకుడు రాజమౌళి, సినిమాకు అత్యంత కీలకమైన ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే దృశ్యాన్ని అంతే సీక్రెట్ గా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రీకరణలో నటీనటులు, రాజమౌళి, కెమెరామెన్ సెంథిల్ మాత్రమే ఉన్నారని, కనీసం లైట్ బాయ్ లు కూడా లేకుండా సీన్ ను తీశారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తన సొంత క్రూ మెంబర్లను కూడా ఆయన షూటింగ్ స్పాట్ నుంచి పంపేశారని తెలుస్తోంది. సినిమా మంచి బిజినెస్ చేసిన నేపథ్యంలో ఈ సీన్ బయటకు పొక్కితే సస్పెన్స్ విడిపోతుందన్న ఆలోచనతోనే సినిమాకు ఆయువుపట్టు అయిన ఈ సీన్లను రాజమౌళి రహస్యంగా షూట్ చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News