: వైఎస్ వేరు, జగన్ వేరు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి వాళ్లు జీవితంలో ఓ పద్ధతిలో ఉండేవాళ్లని, కానీ ఆయన పుత్రుడు, నేటి వైకాపా నేత వైఎస్ జగన్ పద్ధతిలేని వ్యక్తని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడినా వృథాయేనని, అయినా ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి గౌరవిస్తానని అన్నారు. ఏబీఎన్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్ వేరు, జగన్ వేరని చెబుతూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి లబ్ధి కలగాలన్నదే తన అభిమతమని, అయితే, అభివద్ధికి ప్రతిపక్షం అడుగడుగునా అడ్డు తగులుతోందని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో అవినీతికి పాల్పడలేదని, పారదర్శకమైన పాలన అందించడమే తన ధ్యేయమని అన్నారు. శాశ్వత అభివృద్ధిని తాను కోరుకుంటున్నానని, ప్రజలు సైతం తన సేవలను గుర్తించాలని కోరారు. విపక్షాలు చెప్పే అన్ని విషయాలనూ పక్కన పెట్టాలని భావించడం లేదని, వారు చెప్పే విషయాల్లో మంచి ఉంటే అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News