: స్నేహితుడ్ని వెనకేసుకొస్తూ... పోలీసు ఉన్నతాధికారిపై ప్రధాని తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చిందులు


ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ మధ్యప్రదేశ్ లోని పోలీస్ ఉన్నతాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే...మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ కు చెందిన అనిల్ రాథోడ్ స్థానికంగా దాబా నిర్వహిస్తున్నారు. ఆయన ప్రహ్లాద్ మోదీకి స్నేహితుడు. అనిల్ రాథోడ్ కారు టైరు పంక్చర్ కావడంతో రిపేర్ చేయాలని ఆ ప్రాంతంలో ఓ వ్యక్తిని కోరారు. అయితే అందుకు ఆ వ్యక్తి నిరాకరించారు. దీనిపై ఆగ్రహించిన రాథోడ్, అతడి అనుచరులు అతనిపై దాడి చేసి, అతని కుటుంబంలోని మహిళలను వేధించారు. సదరు వ్యక్తి దళిత వ్యక్తి కావడంతో అనిల్ రాథోడ్, అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసులు నమోదు చేయడంతో, అనిల్ రాథోడ్ పరారయ్యాడు. అతని అనుచరుల్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అనిల్ రాథోడ్ నివాసంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ డీఐజీ సంతోష్ సింగ్ ను కలిశారు. తన స్నేహితుడిపై తప్పుడు కేసులు పెట్టారని, ఆయనను వేధిస్తున్నారని చిందులు తొక్కారు. దీంతో ఆయన ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News