: కథ, పాత్ర డిఫరెంటుగా ఉండాలి.. అటువంటి సినిమాల్లో నటిస్తా: అమెరికాలో హీరో విక్రమ్
విభిన్న చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిన ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో విక్రమ్, 'ఇంకొక్కడు' సినిమాతో మరోసారి తన నటనలో కొత్తదనాన్ని పరిచయం చేయనున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన నయనతార, నిత్యామీనన్‌లు నటిస్తున్నారు. తమిళ్ లో 'ఇరుముగన్' పేరుతో ఈ సినిమా రానుంది. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న విక్రమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమాలో తనకు, నయనతారకు మధ్య మంచి కెమిస్ట్రీ పండిందని అన్నాడు. సినిమాలో కథ, పాత్ర డిఫరెంటుగా ఉండాలని, అటువంటి సినిమాల్లోనే తాను నటిస్తానని విక్రమ్ చెప్పాడు. కొత్తదనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించే సినిమాలంటే తనకు ఎంతో ఆసక్తని అన్నాడు. అమెరికాలో తన సినిమాలు థియేటర్లలో కన్నా టీవీల్లోనే బాగా చూస్తున్నారని, అపరిచితుడు, ఐ సినిమాలను టీవీల ద్వారానే అధికంగా చూశారని పేర్కొన్నాడు. మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`తో వచ్చేనెల ఎనిమిదో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరాడు.