: భారతీయత అంటే దేశభక్తి మాత్రమే కాదు...నడవడిక కూడా!: సినీ నటుడు విక్రమ్
భారతీయతపై సినీ నటుడు విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇంకొక్కడు' సినిమా ప్రమోషన్ లో భాగంగా విక్రమ్ మాట్లాడుతూ, 70వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకున్న మనమంతా, స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలాలైన స్వేచ్ఛను అనుభవిస్తున్నామని అన్నాడు. భారతీయులు ఎక్కడున్నా తమ వ్యవహార శైలితో మంచి పేరుతెచ్చుకుంటారని చెప్పాడు. భారతీయత అంటే కేవలం దేశభక్తి మాత్రమే కాదని అన్నాడు. భారతీయత అంటే సంప్రదాయం, నడవడి అని చెప్పాడు. ఈ రెండింటిని కాపాడుకుంటే భారతీయత నిలబడుతుందని అన్నాడు. భూమిని, పర్యావరణాన్ని కాపాడుకోవడంలో అందరూ తమ పాత్ర పోషించాలని, ఆ రెండూ సమతులంగా ఉన్నంత వరకే మానవ మనుగడ సాధ్యమని చెప్పాడు.