: గోవా బాధ్యతలను నితిన్ గడ్కరీపై మోపిన బీజేపీ అధిష్ఠానం
వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే గోవాలో తిరిగి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ, రాష్ట్రానికి తమ పార్టీ ఇన్ చార్జ్ గా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని నియమించింది. గోవాలో ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఉండవచ్చన్న ఉద్దేశంతో గడ్కరీ మాత్రమే, ఆప్ నేతలను సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గడ్కరీ నేతృత్వంలో గోవాలో విజయం కైవసమవుతుందని భావిస్తున్నట్టు పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జార్ఖండ్ రాష్ట్రానికి బీజేపీ చీఫ్ గా ఉన్న తాలా మరాండీ రాజీనామా చేసిన నేపథ్యంలో, లక్ష్మన్ గిలువాను ఆ స్థానంలో నియమించినట్టు పార్టీ ప్రకటించింది.