: హిల్లరీ క్లింటన్ కు చెందిన కీలక సమాచారాన్ని త్వరలో బయటపెడతా: వికీలీక్స్ వ్యవస్థాపకుడు
అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఉన్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు సంబంధించిన సమాచారాన్ని త్వరలో బయటపెడతానంటూ వికిలీక్స్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ జూలియస్ అసోంజీ సంచలన ప్రకటన చేశారు. ఫాక్స్ న్యూస్ శాటిలైట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, హిల్లరీ క్లింటన్ ప్రచారానికి సంబంధించి కీలక సమాచారాన్ని త్వరలో బయటపెడతానని పేర్కొన్నారు. నవంబర్ 8న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కంటే ముందుగా ఈ సమాచారాన్ని బహిర్గతం చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభావం ఎన్నికలపై పడుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, బయటపెట్టబోయే సమాచారం చాలా ముఖ్యమైందని తాను భావిస్తున్నానని, ఈ విషయంపై ప్రజలు, మీడియా చూపించే ఆసక్తిని అనుసరించి ఈ వార్త సంచలనం అవుతుందా? లేదా? అనేది ఉంటుందన్నారు.